పీజీ రెండవ దశ సీట్ల కేటాయింపు

3 Sep, 2016 21:20 IST|Sakshi
కమాన్‌చౌరస్తా : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు రెండవ దశ సీట్లను కేటాయించడం శనివారం జరిగిందని కాకతీయ యూనివర్సీటీ ప్రవేశాల విభాగం అధికారులు డాక్టర్‌ వెంకయ్య, లక్ష్మీనాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు కోర్సు, సై ్లడింగ్‌ ఫీజును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చలాన ద్వారా కానీ, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. సీటు అలాట్‌మెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని లేనిచో ప్రవేశాలు రద్దవుతాయని వెల్లడించారు. ప్రత్యేక విభాగాలు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఇతర విభాగాలకు సర్టిపికేట్‌ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఈ నెల 8న కాకతీయ ప్రవేశాల విభాగంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతందని తెలిపారు. చివరి దశ సీట్లను ఈనెల 9న కేటాయిస్తామని తెలిపారు. వెబ్‌ ఆప్షన్లు 9 నుంచి 11 తేది వరకు ఉంటాయని పేర్కొన్నారు. తుది దశలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని లేనిచో వారి అడ్మిషన్‌లు రద్దు అవుతాయని సూచించారు. 
 
 
 
>
మరిన్ని వార్తలు