సివిల్‌ ఆస్పత్రికి చికిత్స చేయరూ!

15 Oct, 2016 09:22 IST|Sakshi

చిట్యాల : మండల కేంద్రంలోని వైద్య విధానపరిషత్‌ సామాజిక వైద్యశాల జిల్లా విభజనకు ముందు ప్రసూతి ఆపరేషన్లలో రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో 190 రోజుల్లో 175 ప్రసూతి ఆపరేషన్లు ఆస్పత్రి నిర్వహించి  వైద్యులు రికార్డు నెలకొల్పారు. రోగులకు, గర్భిణీలకు మెరుగైన వైద్యసేవలందిస్తూ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆదర్శ ఆస్పత్రిగా పేరు గడించింది.


కష్టాలు మొదలు..
ఆస్పత్రికి గత నెల 20 నుంచి కష్టాలు మొదలయ్యాయి. గత నెల 19న స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి వెలిశాల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ క్రమంలో చిట్యాల సివిల్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న నలుగురు డాక్టర్లను డిప్యూటేష¯ŒS పై ఎందుకు పంపావని జిల్లా కో ఆర్డినేటర్‌ ఆకుల సంజీవయ్యను అడిగారు. దీంతో డిప్యూటేషన్లను రద్దు చేయాల్సింది పోయి మరుసటి రోజు మరో డాక్టర్‌ను జనగాంకు డిప్యూటేష¯ŒS పై పంపారు. మొత్తం నూతన జిల్లాల్లో ఏ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పోస్టును ఎత్తివేయలేదు. కానీ చిట్యాల సివిల్‌ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ పోస్టును జిల్లా కో ఆర్డినేటర్‌ రద్దు చేసినట్లు వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. పాత జిల్లాలో పది సివిల్‌ ఆస్పత్రిల్లో చిట్యాల ఆస్పత్రి పేరు లేకపోవడంతో వచ్చే నిధులు రాకుండాపోయాయనే విమర్శలు వినబడుతున్నాయి.


గర్భిణులను వెనక్కి పంపిన వైనం..
సివిల్‌ ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్లు చేసే డాక్టర్‌ పద్మను సివిల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జయశంకర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఈక్రమంలో బుధవారం ఆరుగురు గర్భిణులు ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చారు. ఇప్పటి వరకు 100కు పైగా ప్రసూతి ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ పద్మ ఇప్పుడు చేయలేనని నిరాకరించారు. ఒక ఆపరేష¯ŒSకి అనస్తీషియా డాక్టర్‌కు రూ.1200 లు ఇవ్వలేనని చెప్పడంతో ఆరుగురు గర్భిణులు వెనక్కి పంపడం మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్‌ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్‌ మురళి చిట్యాల సివిల్‌ ఆస్పత్రిని సందర్శించి అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేసి, ఆస్పత్రికి సూపరింటెండెంట్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యసేవలు, ప్రసూతి కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు