డాక్టర్‌ వేధింపులపై సిబ్బంది నిరసన

7 Aug, 2016 10:44 IST|Sakshi
డాక్టర్‌ వేధింపులపై సిబ్బంది నిరసన
కొడవలూరు: స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి సయ్యద్‌ అబ్‌షా తమను వేధిస్తున్నారంటూ పీహెచ్‌సీ ఎదుట సిబ్బంది శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత డిసెంబర్‌లో వైద్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ పీహెచ్‌సీని సందర్శించి డాక్టర్‌ విధుల్లో లేకపోవడంతో రెండు రోజులు ఆబ్సెంట్‌ వేశారని, దీనికి సిబ్బందే కారణమంటూ వేధింపులకు దిగారని ఆందోళన వ్యక్తం చేశారు.

సిబ్బందికి వేతనాలను సకాలంలో ఇవ్వకుండా రెండు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. డాక్టర్‌కు పీఆర్సీ రాకపోయినా సిబ్బంది జీతాలను నిలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ వేధింపులు తాళలేక రెండో ఏఎన్‌ఎంగా ఉన్న విజయలక్ష్మి ఏడాది పాటు సెలవు పెట్టారని చెప్పారు. ఈ విషయాలను శుక్రవారం డీఎంహెచ్‌ఓ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. హెచ్‌ఎస్‌ షఫీఉల్లా, సిబ్బంది సుగుణ, అనితాకుమారి, శైలసుధ, తబిత, హిమజకుమారి, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు