‘ పూలే ’ చిత్ర బృందానికి అభినందన

10 Aug, 2016 18:39 IST|Sakshi
గుంటూరు ఎడ్యుకేషన్‌: కళాకారుడు సుందర్‌ రావు దర్శకత్వంలో నిర్మించిన ‘‘మహాత్మా జ్యోతిరావ్‌ పూలే’’ సందేశాత్మక చిత్ర ప్రదర్శనను ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నగరానికి వచ్చిన చిత్ర బృందాన్నిS అరండల్‌పేటలోని తన కార్యాలయంలో వైకే అభినందించారు. ఈసందర్భంగా ఆయనS మాట్లాడుతూ పూలే చిత్ర ప్రదర్శనను ప్రజా ఉద్యమంగా నిర్వహించే విషయమై ఈనెల 21న విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, కళాకారులు, ప్రముఖులతో చర్చిస్తామని వివరించా రు. చిత్ర దర్శకుడు సుందర్‌రావు మాట్లాడుతూ మహాత్మాపూలే జీవితం, ఉద్య మం, తాత్వికత, సైద్ధాంతిక సందేశాలను తెలుగు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో చిత్ర నిర్మాణాన్ని సంకల్పించినట్లు చె ప్పారు. నవంబర్‌ 28న చిత్రం విడుదల చేస్తామని తెలి పారు. కార్యక్రమంలో పూలే కళా మండలి నాయకుడు కొల్లూరి నాగేశ్వరరావు, బీసీ మహాజన సమితి నాయకులు ఉగ్గం సాంబశివరావు, నక్కా శంకర్, బీసీ ఐక్య సం ఘర్షణ సమితి నాయకులు బి.నాగమణి, సీహెచ్‌ వాసు, బొంతా సురేష్, బీసీ సంఘ నాయకుడు కన్న మాస్టారు, సైకం రాజశేఖర్, కె. మాణిక్యాలరావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు