పేలిన నిర్లక్ష్యం

21 Dec, 2016 00:05 IST|Sakshi
పేలిన నిర్లక్ష్యం
  • పైపులైన్‌ పేలుడుతో మరోసారి బయటపడిన వైనం
  • చమురుతో నిండిపోయిన రోడ్లు, బోదెలు
  • గొల్లపాలెం గ్రామంలో ఘటన
  • శిథిల లైన్లు.. నాసిరకం పనుల వల్లే..!
  • ముడి చమురు సరఫరాకు కీలకమైన పైపులైన్లు అవి. వాటిని ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. నాసిరకమైన పైపులు కావడంతో తరచూ పగిలిపోతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. కేవలం మరమ్మతులతో సరిపుచ్చుతున్న ఓఎన్జీసీ.. వాటిని పటిష్టపరచడంలో నిర్లక్ష్యం చూపుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు.
    – మలికిపురం
     
    మలికిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం సంభ వించిన పైపులై¯ŒS పేలుడుతో ఓఎన్జీసీ నిర్లక్ష్యం, నాసిరకం లైన్ల ఉదంతం మరోసారి బయటపడింది. గ్రామంలోని కరవాక సరిహద్దులో కేడబ్ల్యూఏఏ బావి నుంచి తూర్పుపాలెం జీసీఎస్‌కు క్రూడాయిల్‌ సరఫరా చేస్తున్న ఈ పైపులై¯ŒS ఉదయం 7.30కు భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు రోడ్డుపై గోతులు పడ్డాయి. క్రూడాయిల్‌ ఎగసి సరుగుడు చెట్లపై పడడంతో అవి విరిగిపోయాయి. రోడ్లు, సరుగుడు తోటల్లోని బోదెలు చమురుతో నిండిపోయాయి.
    నాసిరకం వల్లే..
    సుమారు పదేళ్ల క్రితమే ఈ పైపులైన్లు వేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో నాసిరకంగా వేయడం వల్ల అవి తరచూ పేలిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు గంటకు పైగా చమురు ఎగసిపడిందని చెప్పారు. ఎట్టకేలకు జీసీఎస్‌ సిబ్బంది బావి వద్దకు చేరుకుని.. చమురు సరఫరా నిలిపివేయడంతో ఎగసిపడడం తగ్గుముఖం పట్టింది.
    తోటలకు తీవ్ర నష్టం
    సుమారు 25 ఎకరాలకు పైగా సరుగుడు తోటలు చనిపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని ప్రధాన రహదారి పైనే ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ వెళ్లకపోవడం, రైతులు కూడా ఇంకా పొలాల్లోకి రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. సముద్ర తీరంలో సుమారు 50కి పైగా చమురు బావులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పైపులను మార్చకపోవడం, మరమ్మతుల్లో ఓఎన్జీసీ పూర్తి నిర్లక్ష్యధోరణి అవలంబించడం వల్లే ఈ ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
     
మరిన్ని వార్తలు