పాక్తో యుద్ధం చేయమని రూ.6 అడ్వాన్స్ ...

10 Jan, 2016 10:13 IST|Sakshi
పాక్తో యుద్ధం చేయమని రూ.6 అడ్వాన్స్ ...

వచ్చేశామండీ.. వచ్చేశామండీ.. పిట్టల దొరలమొచ్చేశామండీ..మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తనయ్, లక్షలుంటే నక్కలు తినేస్తనయ్, పదులుంటే పందులు తినేస్తనయ్..చివరకు చిల్లరుంటే చీమలు తినేస్తనయ్..మా ఇంట్లో భోజనాలు పెడతామంటే వంకాయ తింటే వంగిపోతున్నరు..బీరకాయ తింటే బిగుసుకుపోతన్నరు..ములక్కాయ తింటే ముదిరిపోతున్నరండీ..పొట్లకాయ తింటే పొట్టొస్తందని లడాయి పప్పుసార్లు లడాయి పప్పు ఎండ్రినేసి..కిరసనలా పోసి పెట్టామండీ..మరి తిన్నాక బాగున్నారండీ..ఆనక ముగ్గురెళ్లి మంచానికి కరుచుకున్నారండీ..పొద్దునే అమెరికా వాళ్లొచ్చి పాకిస్తాన్ యుద్ధం చేయమని నాకు ఆరు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండీ..అవి తీసుకుని జీడికాయంత జీపేసుకుని..తూటికాడంత తుపాకి తీసుకుని బయలుదేరానండీ..డీజిల్ అరుుపోయిందని జీపు చెరువులో పడిపోతే నేనొచ్చి ఇక్కడి పడిపోయానండీ..


మాకిచ్చే మామూలు మాకిస్తే పాకిస్తాన్‌తో యుద్ధానికి బయలుదేరుతానండీ..దుబాయ్‌లో దూది ఫ్యాక్టరీ మాదే..ఏలూరులో ఎలుకల ఫ్యాక్టరీ మాదే..మీకేదైనా కావాలంటే రీఫిల్ లేని పెన్ను తెచ్చుకోండి మొత్తం రాసిచ్చేస్తానండీ..మరి మేము ఇళ్లు కడతామంటే తాటాకేస్తే గలగల మంటంది, ఇటికేస్తే ఇరిగిపోతంది, పెంకేస్తే పేలిపోతంది, నాపరాయేస్తే నలిగిపోతందండీ..అందుకే మా ఇంటికి కోడి పియ్య టాపేశామండీ..ఎందుకంటా వర్షాలొస్తే కారి సువాసన వస్తుందనండీ..

మా ఇంట్లో కేజీ బంగారముంటే కుక్క నాకిందని చెత్త కుప్పలో పడేశామండీ, కోడిపిల్లలకు నూకలు లేక ఇలా వచ్చామండీ..మా గన్ ముందు మూడు కిలోమీటర్లు, వెనక ఏడు కిలోమీటర్లు పేలిపోతుందండీ..మరి ఆపుచేయంటారా, మూసేయమంటారా. ఆపు చేస్తే ఆరు వేలండీ..మూసేస్తే మూడు వేలండీ..మరి మాగన్‌కు లెసైన్సు లేదండీ..కాలిస్తే కేసులేదండీ..మా గన్‌లో ఇప్పుడు బులెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటలకు పేలతయ్యండీ..ఏంటీ పొట్ట చెక్కలవుతుందా..నవ్వుల జల్లులో తడిసి ముద్దయ్యారా..ఎప్పుడో మన తాతల కాలంలో చెప్పిన పిట్టల దొర గుర్తొస్తున్నాడా..ఇప్పుడు వాళ్ల వారసుడు సోషల్ మీడియాలో హల్‌చల్  చేస్తూ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాడు.

మరిన్ని వార్తలు