పునరావాస కాలనీ ఏర్పాటుకు స్థల పరిశీలన

13 Aug, 2016 22:25 IST|Sakshi
కాసిపేట : సింగరేణి యాజమాన్యం నిర్మాణం చేపట్టనున్న కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసిత గ్రామం దుబ్బగూడెం గ్రామస్తులు శనివారం పునరావాస కాలనీ ఏర్పాటుకు సింగరేణి స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి అధికారి సురేష్‌ ఆధ్వర్యంలో గ్రామం నుంచి 30మందిని బెల్లంపల్లి శివారులోని 68డీప్‌ ప్రాంతంలో ఉన్న సింగరేణి స్థలాన్ని చూపించారు.
ప్రభుత్వం మంజూరు చేయనున్న డబుల్‌బెడ్‌రూం గహాలకు సైతం ఇక్కడే స్థలం కేటాయించడం జరుగుతుందని, దుబ్బగూడెం పునరావాసానికి సైతం అనుకూలంగా ఉంటుందని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు మందమర్రి శివారు, స్టేషన్‌పెద్దనపల్లి సమీపంలో, పెద్దనపల్లి శివారులలో ఉన్న భూములను సైతం పరిశీలించారు.
ఎక్కడ నచ్చితే అక్కడ గ్రామస్తులు అంగీకరించినట్లయితె రెవెన్యూ అధికారులు భూములు ప్రభుత్వానివా, కొనుగోలు చేయడమా నిర్ణయం తీసుకుంటారన్నారు. 68డీప్‌ సింగరేణి ప్రాంతం కావడంతో ఎటువంటి సమస్య లేదని గ్రామస్తుల అభీష్టం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. తాము చూసిన చోట్లలో ఎక్కడ ప్రభుత్వం ఇవ్వడానికి సాధ్యం అవుతుందో తెలిపినట్లయితే స్థలంపై నిర్ణయం ప్రకటిస్తామని గ్రామస్తులంతా ముక్తకంఠంతో తెలిపారు.
 
మరిన్ని వార్తలు