సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

26 Jan, 2017 22:30 IST|Sakshi
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

సీఎం, మంత్రి ఐకేరెడ్డి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం

నిర్మల్‌ టౌన్  :   ఆర్మూర్‌– నిర్మల్‌– ఆదిలాబాద్‌ రైల్వేలైన్ నను ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తంచేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు, సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఐకేరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్‌ సర్వసభ్యసమావేశంలో సభ్యులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశమందిరంలో బుధవారం మున్సిపల్‌ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్  అప్పాల గణేశ్‌చక్రవర్తి మాట్లాడారు. నిర్మల్‌కు రైల్వేలైన్  రావడానికి మంత్రి ఐకేరెడ్డి కృషిచేశారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇప్పటికే జిల్లాకేంద్రంలో పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్‌ నుంచి చించోలి(బి) వరకు డ్రెయినేజీ నిర్మించేందుకు రూ. 30లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల టాకీస్‌ వద్ద ఉన్న మురుగుకాలువ పరిస్థితిపై మున్సిపల్‌ వైస్‌ చైర్మన్  అజీంబిన్ యాహియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ మాట్లాడారు. తిరుమల టాకీస్‌ వద్ద ఉన్న మురుగుకాలువకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి సగం మంది సభ్యులే హాజరుకావడంతో సమావేశం బోసిపోయింది.

మరిన్ని వార్తలు