మహారాష్ట్రలో మొక్కలు నాటిన సర్పంచ్‌

11 Sep, 2016 20:34 IST|Sakshi

సిద్దిపేట రూరల్‌: మహారాష్ట్రలోని పర్లీ నియోజకవర్గంలో గల గోపాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం సిద్దిపేట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మొక్కలు నాటారు. గతంలో గోపాల్‌పూర్‌ సర్పంచ్‌ అశోక్‌డిగోలె సిద్దిపేటలో పర్యటించి మొక్కలు నాటిన విధానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చిన్నగుండవెల్లి సర్పంచ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఆహ్వానించి మొక్కలు నాటించారు.

ఈ సందర్భంగా సిద్దిపేటలో నాటిన మొక్కల తీరుపై ప్రశంసలు కురిపించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో చేపడుతున్న అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అక్కడి ప్రజలకు వివరించినట్లు చెప్పారు. అదే విధంగా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల విధానంపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. అలాగే గోపాల్‌పూర్‌లో వివిధ రకాల సుమారు వెయ్యి మొక్కలు నాటినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు