ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మెుక్కలు నాటాలి

14 Sep, 2016 22:36 IST|Sakshi
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మెుక్కలు నాటాలి
మిర్యాలగూడ అర్బన్‌ : ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటì  సంరక్షించాలని ఓఎస్‌డీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం వినాయక నిమజ్జనంలో భాగంగా మఠంపల్లి, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌ పట్టణాలలో భద్రతను సమీక్షించేందుకు వచ్చిన ఆయన  పట్టణం లోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివాహాలు, ఏదైనా ఫంక్షన్లు జరిగిన సమయంలో మొక్కను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పోలీస్‌స్టేషన్లలో సైతం మొక్కలను నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మామిడి, జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను సరఫరా చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో అదనంగా రెండు పోలీస్‌ స్టేషన్‌లతో పాటు ఒక సబ్‌డివిజన్‌ సర్కిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రౌడీ మూకల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ రాంగోపాల్‌రావు, సీఐ దూసరి భిక్షపతి, ఎస్‌ఐ విజయ్‌కుమార్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.   
 
>
మరిన్ని వార్తలు