మొక్కలు పెంచడం అందరిబాధ్యత

22 Jul, 2016 01:18 IST|Sakshi
అచ్చంపేట రూరల్‌ : మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షిద్దామని నగరపంచాయతి చైర్మన్‌ తులసీరాం అన్నారు. గురువారం పట్టణంలోని 19వ వార్డులో వైస్‌ చైర్మన్‌ రాజు ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎమ్మార్సీ కార్యాలయం వద్ద డిప్యూటీ ఈఓ, ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ వెంకటయ్య, చందాపూర్, సింగారంలో ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్, హాజీపూర్, బుడ్డతండాలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ అనుదీప్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. 
పచ్చదనమే ప్రగతికి మార్గం : ఎంపీపీ
లింగాల : పచ్చదనమే ప్రగతికి మార్గమని ఎంపీపీ మంజుల అన్నారు. గురువారం మండల పరిధిలోని వల్లభాపూర్, రాంపూర్, మానాజీపేట పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల దగ్గర పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎంపీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిర్పతయ్య, సింగిల్‌విండో చైర్మెన్‌ కొండల్‌రావు, వైస్‌ఎంపీపీ కిషన్‌నాయక్, ఎంపీటీసీ సుధీర్‌గౌడు, సర్పంచ్‌ నారాయణ, ఎంపీడీఓ వెంకట్‌ప్రసాద్, తహసీల్దార్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాణోజీ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు