మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

17 Sep, 2016 21:21 IST|Sakshi
మొక్కల పెంపకం సామాజిక బాధ్యత
  • జిల్లా అటవీ అధికారి అప్పన్న
  •  
    ధవళేశ్వరం : 
    మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి అప్పన్న పిలుపునిచ్చారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం జరిగిన వనం–మనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కలను పరిరక్షిస్తామని తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం విస్తీర్ణంలో మొక్కలు ఉన్నాయన్నారు. దీనిని 2029 నాటికి 50 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా తమ శాఖ ప్రతి శనివారం పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎఫ్‌ఆర్‌ఓ టి.శ్రీనివాసరావు, కాకినాడ ఎఫ్‌ఆర్‌ఓ జి.మురళీకృష్ణ, అనపర్తి ఎఫ్‌ఎస్‌ఓ ఎస్‌.వెంకట రమణ, కళాశాల పీడీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు