చేతివృత్తిదారుల అభివృద్ధికి కృషి

24 Sep, 2016 17:52 IST|Sakshi
చేతివృత్తిదారుల అభివృద్ధికి కృషి

కడప వైఎస్సార్‌ సర్కిల్‌:
చేతివృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని జిల్లా సమన్వయ కమిటీ గౌరవ సలహాదారు జి.చంద్రశేఖర్‌ కోరారు. శనివారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా జనాభాలో వడ్రంగి,గౌడ, వడ్డెర,తొగట బట్రాజు,గొల్ల కురువ,క్షౌర, రజక,చేనేత  వంటి చేతివృత్తిదారులు సగం పైనా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా వికలాంగుల ఉన్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదన్నారు .చేతివృత్తిదారుల మహిళలకు పావలా వడ్డీ కూడ సక్రమంగా అందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేతివృతిదారుల అభివృద్ధికి పాటుపడి సంక్షేమ ప«థకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గొర్ల పెంపకందారుల సంఘం జిల్లా కన్వీనర్‌ బయన్న,చేతివృత్తిదారుల సంఘం కన్వీనర్‌ శివనారాయణ,రజక వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ పుల్లయ్య,పలువురు సంఘం జిల్లా కన్వీనర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు