కవిత్వం సామాజిక బాధ్యత

28 Jul, 2016 21:44 IST|Sakshi
కవిత్వం సామాజిక బాధ్యత
  •  కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి
  •  
     గుంటూరు(అరండల్‌పేట): మార్క్సిజం నాకు విశ్వ దర్శనం కావించిందని, అదే నా సాహిత్య మార్గదర్శి అని, కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం తర్వాత ఒక సామాజిక బాధ్యతగా కవిత్వాన్ని రాశానని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కే శివారెడ్డి అన్నారు. గురువారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ‘నేను–నా కవిత్వం’ అన్న అంశంపై  చర్చా కార్యక్రమం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ ఎక్కడా తేలిపోకుండా, జారిపోకుండా, ఏ గాలికీ కొట్టుకుపోకుండా కవిత్వయాత్ర చేస్తున్నానని తెలిపారు. నా కవిత్వంలో విద్యార్థులు, అనాథలు, జానపదlగాయకులుఏ కళకళలాడేలా చేస్తున్నానన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఐరోపా, ఆఫ్రికా కవుల అధ్యయనాలు తన కవిత్వాన్ని విస్తతం చేశాయని చెప్పారు. ఇప్పటికి 26 కవితా సంపుటిలు వెలువరించానని, వెయ్యి పుస్తకాలకు పీఠికలు సమకూర్చానని తెలిపారు. కార్యక్రమంలో రావెళ్ల సాంబశివరావు, భూసూరుపల్లి వెంకటేశ్వర్లు, బీ వేదయ్య తదితరులు పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు