పేకాట స్థావరంపై పోలీసుల దాడి

20 Jul, 2016 00:29 IST|Sakshi
బీబిగూడెం(చివ్వెంల) : పేకాట  స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్‌ఐ రౌతు రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బీబిగూడెం గ్రామ శివారులోని ఓ మామిడి తొటలో పేకాట ఆడుతున్న ఆత్మకూర్‌(ఎస్‌) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కొండేటి బుచ్చిరెడ్డి, మల్లోజు వెంకన్న, బొప్పారం గ్రామానికి చెందిన పగడాల క్రిష్ణారెడ్డి, ఏపూర్‌ గ్రామానికి చెందిన తొండల నారాయణ, సూర్యాపేట మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన కాటోజు జనార్ధనాచారి, చివ్వెంల మండల కేంద్రానికి చెందిన శిగ లచ్చయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.12,700 నగదు, మూడు బైక్‌లు, 4 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.   
 
 
మరిన్ని వార్తలు