నందలో పోలీస్‌ తనిఖీలు

28 Jul, 2016 23:59 IST|Sakshi
అమరవీరుల స్మారక వారోత్సవాలు 
 
మక్కువ : ఈ నెల 28 నుంచి మాఓయిస్టుల అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ గ్రామమైన నందలో గురువారం గ్రామదర్శిని, వారపు సంతలు జరగడంతో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు పహారా కాశారు. సంతకు మాఓయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఒడిశాకు చెందిన లొచ్చ, సిరివొర, ఎగువులొచ్చ, దిగువులొచ్చ గ్రామాలతో పాటు మక్కువ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న బొరిగి, పరిసర ప్రాంతాల్లో మాఓయిస్టుల సంచారం ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  
మరిన్ని వార్తలు