కొనసాగిన నిర్బంధం

30 Dec, 2016 23:07 IST|Sakshi
  • ఖండించిన అఖిలపక్షం 
  • నాయకుల అరెస్ట్‌
  • కాకినాడ సిటీ/కాకినాడ క్రైం :
    కేఎస్‌ఈజెడ్‌ పోర్టు నిర్మాణంపై తొండంగి మండలంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం కూడా సుందర్యభవ¯ŒSపై పోలీసులు నిర్బం««దlం కొనసాగింది. ఈ చర్యలను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సుందరయ్యభవ¯ŒSలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై వారు ధ్వజమెత్తారు.  2013 భూసేకరణ చట్టా న్ని తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగ హ క్కులను కాలరాస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బం దులు పెట్టినా చంద్రబాబు ఆటలు సాగనివ్వబోమని, బా బుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అఖిలపక్షం హెచ్చరించింది. సమావేశం అనంతరం నాయకులంతా సుందరయ్యభవ¯ŒS నుంచి పాతబస్టాండ్‌ రోడ్‌ మీదుగా ప్రదర్శనగా బయల్దేరారు. బలవంతపు భూసేకరణ తగదంటూ నినాదాలు చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పెదిరెడ్డి సత్యనారాయణ, ఆర్‌పీఐ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, అయినాపురపు సూర్యనారాయణ, లోక్‌సత్తా నాయకుడు రాజ్‌వర్శ,  సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి నాయకులు కర్నాకుల వీరాంజనేయులుతో పాటు 21 మందిని అరెస్ట్‌ చేసి స్థానిక త్రీటౌన్, పోర్టు స్టేషన్లకు తరలించారు.
    కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో
    అఖిల పక్షపార్టీల నేతల అక్రమ అరెస్టులను  నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్దాడ సుబ్బారాయుడు, బసవా చంద్రమౌళి, తదితరులు త్రీటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట రాస్తారోకో, ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. 
     
మరిన్ని వార్తలు