నగరిలో పోలీస్ జులుం

16 Aug, 2015 05:49 IST|Sakshi

నగరి: చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పోలీసులు జులం ప్రదర్శించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత  నగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతా కుమారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు యత్నించారు.

శాంతాకుమారి ఇంటి గేటుకు వేసిఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన  వైఎస్సార్ సీపీ కార్యకర్తలు..  శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు.

 

ఒక పాత కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు.. మున్సిపల్ చైర్ పర్సన్ శాంతా కుమారిని, భర్తను  అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నించారు.  కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం వివాదాలకు దారి తీస్తోంది. ఒక ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన శాంతకుమారి కుమారుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు