హాస్టళ్ల పరిసరాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలి

26 Aug, 2016 23:23 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • పోలీస్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: బాలల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టళ్ల పరిసరాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ అధికారులను కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా బాలల రక్షణ సొసైటీ సమన్వయ కమిటీ శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లల పూర్తి సమాచారం సేకరించాలని, వారిని సీఆర్‌పీ స్కూల్స్‌లో చే ర్పించాలని అన్నారు. సంఖ్యాపరిమితి లేకుండా అన్ని వసతి Výృహాల్లో విద్యార్థులను చేర్చుకోవాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సేవాసంస్థలకు సంబంధించి  సీడీపీఓ స్థాయిలో పెండింగులోగల దర్యాప్తులను సెప్టెంబర్‌ 20 వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి విష్ణువందన మాట్లాడుతూ.. బాలల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై బాలల సంరక్షణ విభాగాల సమావేశాల్లో చైతన్యపరుస్తున్నట్టు చెప్పారు. శివాయిగూడె, ప్రకాష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పిల్లలను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరచిన తరువత వసతి గృహాల్లో చేర్పిస్తున్నట్టు చెప్పారు. ఐసీడీఎస్‌ పీడీ జ్యోతిర్మయి కూడా మాట్లాడారు. సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, డీఈఓ రాజేష్, ఆర్‌వీఎం పీఓ శ్రీనివాస్, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు