కేంద్రమంత్రి ఇంటి ముట్టడికి యత్నం

12 Sep, 2016 01:00 IST|Sakshi
కేంద్రమంత్రి ఇంటి ముట్టడికి యత్నం
  • విద్యార్థి సంఘాలను అడ్డుకున్న పోలీసులు..
  • పటేల్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన నాయకులు
  • నెల్లూరు(బారకాసు) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి ఇంటిని ముట్టడించేందుకు వైఎస్సార్‌ విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. తొలుత స్థానిక రెండు సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి కరెంటాఫీస్‌సెంటర్‌ నుంచి వెంకయ్య ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకులు పోలీసులను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం నాయకులు, విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కొంతసేపు నినాదాలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 
    సిగ్గుచేటు
    ఈ సందర్భంగా వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కేశవ నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా 15సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు హోదాతో ఎటువంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కిన చంద్రబాబు, నరేంద్రమోదీలను శాశ్వతంగా ఇంట్లో కూర్చోపెడతామన్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర పార్టీలు పోరాటం చేస్తుంటే అధికార పార్టీ తమ స్వార్థం కోసం డ్రామాలాడుతోందని ఆరోపించారు. విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి కాపు హరికృష్ణయాదవ్, నగర ప్రధాన కార్యదర్శులు టి.వినీల్, చరణ్‌తేజ, నిఖిల, సుమంత్, ఎన్‌ఎస్‌యూఐ నగరాధ్యక్షుడు మొమిత్‌షా, మహేష్, నవీన్, సమీర్, నజీర్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు