'పొంగులేటి అలిగి మధ్యలో వెళ్లిపోయారు'

15 Sep, 2015 15:07 IST|Sakshi
'పొంగులేటి అలిగి మధ్యలో వెళ్లిపోయారు'

హైదరాబాద్: పలు అసంతృప్తుల మధ్య తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోంది. ఓ పక్క సమావేశం జరుగుతుండగానే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అర్థాంతరంగా వెళ్లిపోయారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాల్లో పోలవరం ముంపు గ్రామాల అంశం చేర్చకపోవడం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తాను సోనియాగాంధీ వద్దే తేల్చుకుంటానని పొంగులేటి ఈ సందర్భంగా అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో రైతుల సమస్యలపై అసెంబ్లీని స్థంభింపజేయాలని సీఎల్పీ భావించింది. రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, రైతు కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేలా ఒత్తిడి చేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. తాము లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చేవరకు సభను జరగనివ్వకూడదని భావించింది. ఈ లోగా పొంగులేటి తన డిమాండ్ పట్టించుకోకపోవడంతో అలకబూని వెళ్లిపోయారు.  

 

>
మరిన్ని వార్తలు