పీఠాధిపతి తిరుపతి పర్యటన

26 Dec, 2016 00:46 IST|Sakshi
– నేడు శ్రీవారి మెట్లోత్సవానికి హాజరు 
 
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తిరుపతి పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. సోమవారం తిరుమలలోని రాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం మఠంలో పిలిగ్రిం ఇమ్యూనిటీ సెంటర్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి భజన భక్తాదులతో శ్రీవారి ఆది మెట్లను చేరుకుంటారు. అక్కడ పీఠాధిపతి విశిష్ట పూజల నిర్వహించి మెట్లోత్సవానికి అంకురార్పణ పలుకుతారు. దాదాపు వెయ్యి మంది భక్తులతో కలిసి కాలినడక శ్రీవారిని దర్శించుకుంటారు. మంగళవారం అక్కడే రాములోరి పూజా కార్యక్రమాలు ముగించుకుంటారు. సాయంత్రం పీఠాధిపతులకు సన్మానం ఉంటుందని మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు