తిరుమలలో పీఎస్‌ఎల్‌వీ సీ– 35 నమూనా రాకెట్‌కు పూజలు

25 Sep, 2016 23:52 IST|Sakshi
తిరుమల ఆలయం వద్ద ఇస్రో శాస్త్రవేత్తల బృందం

సాక్షి, తిరుమల:
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పీఎస్‌ఎల్‌వీ–సీ35 నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు.  నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 9.12గంటలకు  పీఎస్‌ఎల్‌వీ–సీ35 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇస్రో నిర్వహించే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలేశుని ఆలయంలో నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్‌వెహికల్‌ ప్రోగ్రాం (ఎల్‌వీపీవీ) డైరెక్టర్‌ ఎస్‌కే కనుంగో, శాటిలైట్‌ కమ్యునికేషన్‌ ప్రోగ్రాం (ఎస్‌ఈపీ) డైరెక్టర్‌ సేతురామన్, సైంటిఫిక్‌ సెక్రటరీ పీజీ దివాకర్‌  తదితరులు ఆదివారం తిరుమల ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని, నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు.



 

>
మరిన్ని వార్తలు