చెరువులకు పూజలు

24 Sep, 2016 17:10 IST|Sakshi
చెరువులకు పూజలు

శామీర్‌పేట్‌: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిండిన చెరువుల వద్ద మండలంలోని ప్రజాప్రతినిధులు శనివారం గంగమ్మ పూజలు నిర్వహించారు. శామీర్‌పేట్‌ కట్టమైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి జెడ్పీటీసీ బాలేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, ఐలయ్య, భూమయ్య, రవి పాల్గొన్నారు. అలియాబాద్‌ శ్రీరామాలయం వద్ద పొంగిపొర్లుతున్న వాగులో సర్పంచ్‌ గాదేగౌరికుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ హృదయ్‌కుమార్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు