క్యాష్ కష్టాలు... ఇంకెన్నాళ్లో!

12 Dec, 2016 14:36 IST|Sakshi
క్యాష్ కష్టాలు... ఇంకెన్నాళ్లో!

 చేవెళ్లరూరల్/మొయినాబాద్ రూరల్/షాబాద్: బ్యాంకులలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బ్యాంకులకువ వచ్చిన ఉద్యోగులు, పిన్సనర్లు, ప్రజలు నగదుకోసం క్యూలు కట్టిన కొందిరికి మాత్రమే నగదు లభించింది. నెలరోజులు కావస్తున్న నేటికి పెద్దనోట్ల రద్దుతో ఏర్పాడిన సమస్య ఓ కొలిక్కి రాకపోవటంతో ప్రజలు నానా తంటాలుపడుతున్నారు.
 
  ప్రతిరోజు బ్యాంకుల చుట్టు తిరిగే పనిగానే ప్రజల నిత్యకృత్యమైంది. ఇచ్చే నగదు అయినా ఎక్కువగా ఇవ్వకపోవటంతో కేవలం 2వేలు, 4వేలు మాత్రమే ఇస్తుండటంతో అవీ కనీస అవసరాలకు కూడా సరిపోకపోవటంతో ప్రజలు రోజు బ్యాంకు వద్దకు వచ్చే పని పడుతుంది. కనీసం ఏటీఎం కేంద్రాల్లోనైనా డబ్బులు అందుబాటులో ఉంటాయంనుకుంటే అవీకూడా లేదు.
 
 ఎప్పుడూ చూసి మూసి ఉన్న ఏటీఎం కేంద్రాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు మరో మార్గం లేక బ్యాంకులలో ఇచ్చే 2వేలు, 4వేలకు సైతం ఉదయంన్నే వచ్చి క్యూకడుతున్నారు. కొన్ని బ్యాంకులల్లో ఉదయం వచ్చిన వారికి 2వేల రూపాయల చోప్పున టోక్లను ఇచ్చి మద్యాహ్నం నుంచి టోకన్లు ఇచ్చిన వారికి నగదును అందించే పనులు చేస్తున్నారు. దీంతో మద్యాహ్నం డబ్బుల కోసం వచ్చిన వారికి బ్యాంకులో డబ్బులు లేవనే చెబుతున్నారు. ఉన్న వారకు అందరికి అందించే  ప్రయత్నం చేశాం.
 
 ఇక నగదు లేదని అంటున్నారు. అయితే వచ్చిన వారు సైతం ఇచ్చే 2వేల రూపాయలు, 4వేల రూపాయలు ఎందుకు సరిపోవటం లేదని వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే తమకే డబ్బులు రావటం లేదంటున్నారని చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియటం లేదు. నిత్యవసర ఖర్చులకు సైతం ఈ డబ్బులు సరిపోవటం లేదంటున్నారు. ఉద్యోగులకు సైతం ఒకేసారి 10వేల రూపాయలు అందిస్తామని చెప్పారు.
 
  కాని ఎక్కడ అది అమలు కావటం లేదు. ఎవరికి 10వేలు ఇవ్వలేదు. అందిరితోపాటు సమానంగానే బ్యాంకుల్లో ఉద్యోగులకు నగదు అందిస్తుండటంతో ఉద్యోగులు వీటితో నెలరోజులు ఎలా గడుపాలని అంటున్నారు. రోజు బ్యాంకులకు వచ్చే పరిస్థితి లేదని ఇలా అయితే మా పరిస్థితి ఏమి కవాలని అంటున్నారు. ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి బ్యాంకులలో ప్రజలకు అవసరమైన నగదును అందించేలా.... ఎటీఎం కేంద్రాల్లో విరివిగా నగదు అందుబాటులో ఉంచితే చాలా వరకు సమస్య తీరుతుందని అంటున్నారు.
 

మరిన్ని వార్తలు