నాసిరకంగా పెద్దచెరువు పనులు

4 Oct, 2016 17:45 IST|Sakshi
పిల్లుట్ల పెద్ద చెరువు తూముకు ఏర్పడిన పగుళ్లు

శివ్వంపేట: లక్షలు వెచ్చించి చేపట్టిన మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తోందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పిల్లుట్లలోని పెద్దచెరువు అభివృద్ది పనులను మిషన్‌ కాకతీయ ద్వారా రూ.35లక్షలతో చేపట్టారని రైతులు అంజాగౌడ్, రాఘవరెడ్డి, బాలయ్య, దేవయ్య, వెంకట్‌రెడ్డి, కిష్టయ్య పేర్కొన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ గతంలో ఉన్న తూమును  తొలగించి నూతనంగా నిర్మించిన తూముకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయన్నారు.

దీంతో తూము ఒకపక్క కుంగిపోవడంతోపాటు నీరు వృధాగా పోతోందన్నారు.  మూడునెలలకె పగుళ్లు ఏర్పడడంతో నాణ్యత లోపించిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. లింగోజిగూడ పరిధిలో ఉన్న ఎల్మానుకుంట పనులు సైతం  సక్రమంగా జరగలేదని ఆయకట్టు రైతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు  ఇరిగేషన్‌ శాఖ అధికారుల దృష్టికి  తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.

>
మరిన్ని వార్తలు