రాచపల్లిలో ‘పోరు’ సినిమా షూటింగ్‌

6 Jan, 2017 22:36 IST|Sakshi
రాచపల్లి (ప్రత్తిపాడు) :
 గ్రామంలో ‘పోరు’ సినిమా షూటింగ్‌తో శుక్రవారం సందడి నెలకొంది. వై.ఎస్‌.ఎస్‌.వర్మ దర్శకత్వంలో ‘అమ్మాయిలంతే..అదో టైపు’ ఫేం గోపీవర్మ, అలేఖ్య జంటగా నూతన తారాగణంతో నిర్మాత ఎం.ఎ.రామరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు బుద్దరాజు గోపీరాజు గృహం, రామాలయం, పోలవరం కాలువ వద్ద షూటింగ్‌నిర్వహించారు. గోపీరాజు గృహంలో తొలి రోజు హీరో హీరోయిన్ల చిన్ననాటి సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయి¯ŒS అలేఖ్య, హీరో తండ్రి పాత్రలో బత్తుల ప్రకాష్‌బాబు (పిఠాపురం జర్నలిస్టు), అతని కొడుకు, చిన్ననాటి హీరో పాత్రలో వైభవ్‌వర్మ, హీరోయి¯ŒS తల్లి పాత్రలో లక్ష్మి, తండ్రి పాత్రలో రాచపల్లి గ్రామానికి చెందిన వత్సవాయి అచ్యుత సుబ్బరాజు (హరీష్‌), హీరోయి¯ŒS చిన్ననాటి పాత్రలో లాస్యలపై రామాలయంలో పూజా కార్యక్రమాలను కెమెరామె¯ŒS మోహ¯ŒSచంద్‌ చిత్రీకరించారు. రోహిత్‌వర్మ, సునీల్‌ చరణ్, వ్యాస్, కాకినాడ జేఎ¯ŒSటీయూకే డైరెక్టర్‌ డాక్టర్‌ డి.కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రామ్‌కుమార్‌ కో– డైరెక్టర్‌. షూటింగ్‌ తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సందడి నెలకొంది.  
 
మరిన్ని వార్తలు