సాగునీటి కోసం పోరుబాట

6 Sep, 2016 23:33 IST|Sakshi
సాగునీటి కోసం పోరుబాట

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి
గార్లదిన్నె : మిడ్‌ పెన్నార్‌ (ఎంపీఆర్‌) డ్యాం కింద ఉన్న ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం సాగునీటిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు సిద్ధమైంది. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.


రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో శింగనమల నియోజక వర్గంలోని గార్లదిన్నె, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే  మిడ్‌ పెన్నార్‌ డ్యాంలో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం అధికార బలం ఉన్నవాళ్లే నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్నే ప్రభుత్వ విప్‌ యామినీబాల పబ్లిక్‌ సమావేశాల్లో బలమున్న వాళ్లే నీరు తీసుకొనిపోతున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఆయకట్టు రైతుల బాధ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడి,్డ అనంతపురము మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సుబ్బిరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, రమణరెడ్డి,కొండూరు కేశవరెడ్డి, జంబులదిన్నె సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, బండిఆంజనేయులు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు