కారు స్వాధీనం.. దొంగ అరెస్ట్‌

1 Nov, 2016 00:31 IST|Sakshi

గుత్తి: అపహరణకు గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, దొంగను అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్‌ఐ రామాంజనేయులు సోమవారం గుత్తి పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు.

అక్టోబర్‌ 11న కర్ణాటక రాష్ట్రం∙బీదర్‌కు చెందిన విజయకుమార్‌ కారు( హోండా అకర్డ్‌–కెఎ 04 ఎంసి 8383)ను బీదర్‌కే చెందిన చంద్రకాంత్‌ మరో వ్యక్తి బెంగుళూరు నుంచి నాగపూర్‌కు బాడుగకు మాట్లాడుకున్నారు. అదే రోజూ రాత్రి పది గంటల సమయంలో గుత్తి శివారులోని రాయల్‌ డాబా వద్దకు చేరుకున్నారు. రాత్రి అయిందని విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరుదామని డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ విజయకుమార్‌ను నమ్మించారు. రాత్రి డాబాలో పడుకున్నారు. బాడుగ మాట్లాడుకున్న వారు తెల్లవారు జామున డ్రైవర్‌ను గదిలోనే పెట్టి తాళం వేసుకుని కారుతో ఉడాయించారు. బాధితుడు విజయకుమార్‌ గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం హైవేలో పోలీసులు తనిఖీ చేస్తుండగా అపహరణకు గురై కారు కనిపించింది. వెంటనే కారును స్వాధీనం చేసుకుని, నిందితుడు చంద్రకాంత్‌ను అరెస్టు చేశారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు.

 

మరిన్ని వార్తలు