పోస్టల్‌ కార్యాలయం కిటకిట

16 Nov, 2016 22:59 IST|Sakshi
పోస్టల్‌ కార్యాలయం కిటకిట

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : వారం రోజులవుతున్నా పరిస్థితిలో మార్పు లేదు. పెద్ద నోట్ల రద్దుతో పేదలకు తిప్పలు తప్పడం లేదు.  తెల్లారకముందే జనాలు ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు.  ఇన్నాళ్లు వినియోగదారులు లేక వెలవెలబోయిన పోస్టాఫీస్‌కు నోట్ల రద్దు పుణ్యమాని  జనం క్యూ కడుతున్నారు. ఉదయమే పోస్టాపీసు వద్దకు చేరుకొని కార్యాలయం తెరిచే దాకా పడిగాపులు కాస్తున్నారు. కాగా జాతీయ,ప్రైవేట్‌ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా పోస్టల్‌ శాఖ సేవలు అందిస్తోంది.
పెరుగుతున్న నగదు మార్పిడి  
ఈ వారం రోజుల్లో పోస్టాఫీస్‌లో జరిగిన నగదు మార్పిడి వివరాలు
ఈనెల 10న నగదు మార్పిడి రూ39.11లక్షలు, 11న రూ28.80లక్షలు, 12న రూ 70.83లక్షలు, 13న రూ.57.59లక్షలు 14న రూ.53.73 లక్షలు,15న రూ 32.34 లక్షలు,16న రూ 50 లక్షలు మార్పిడి జరిగింది. అలాగే  10వ తేదీన రూ 23.61 లక్షలు డిపాజిట్లుకాగా, 11న రూ.21.33 లక్షలు  12న రూ.16.49 లక్షలు 13న రూ.7.4లక్షలు, 14న రూ.6.22 లక్షలు 15న రూ.16.97 లక్షలు, 16న రూ.20లక్షలు డిపాజిట్‌ అయ్యాయని అధికారులు తెలిపారు.
  డిపాజిట్లు బాగా పెరిగాయి
పోస్టల్‌ శాఖకు డిపాజిట్‌లు గతంలో అంతగా వచ్చేవి కావు. నోట్ల రద్దుతో డిపాజిట్లు బాగా పెరిగాయి.అంతేకాక నగదు మార్పిడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రద్దీ తగ్గట్టుగా కౌంటర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం.ఎప్పటికప్పుడు జనం రద్దీని పరిశీలిస్తూ అవసరమైతే కౌంటర్లను పెంచుతున్నాం.
–సుబ్బరాయుడు ,హెడ్‌పోస్ట్‌మాస్టర్,కడప
 

మరిన్ని వార్తలు