కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

6 Aug, 2016 22:05 IST|Sakshi
కేటీపీఎస్‌ 5,6 దశల కర్మాగారం

పాల్వంచ : కేటీపీఎస్‌ 5,6 దశల కర్మాగారంలో విద్యుదుత్పత్తి స్తంభించింది. వివిధ మరమ్మతుల కారణంగా కర్మాగారంలోని వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9వ యూనిట్, 500 మెగావాట్ల 11వ యూనిట్‌లో బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీల వల్ల అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. సీఈ పి.రత్నాకర్‌ నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి.. 9వ యూనిట్‌ను శనివారం ఉదయానికి పునరుద్ధరించగా, సాయంత్రానికి 11వ యూనిట్‌ మరమ్మతు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 250 మెగావాట్ల 9వ యూనిట్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 11వ యూనిట్‌ బ్యాక్‌ డౌన్‌ కారణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు సీఈ తెలిపారు. గత నెల 26 నుంచి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్‌ను వార్షిక మరమ్మతుల నేపథ్యంలో నిలిపివేసిన విషయం విదితమే. యూనిట్‌ను 30 రోజులపాటు మరమ్మతు చేసి.. ఈనెల 26 వరకు పునరుద్ధరించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు