సింహ వాహనంపై విశ్వమోహనుడు

19 Aug, 2016 23:40 IST|Sakshi
సింహ వాహనంపై విశ్వమోహనుడు
– ఘనంగా పూర్వారాధన వేడుకలు
– అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం
– సింహవాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయలు
 
మంత్రాలయం:  విశ్వమోహనుడు సింహవాహనంపై అలరారుతూ ఊరేగుతుండగా శ్రీమఠం ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. భక్తజనం భువనమోహనుడి వైభవం తిలకించి మైమరిచారు. శ్రీరాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో రాఘవేంద్రులకు సుప్రభాతసేవ, పంచామతాభిషేకం, పుష్పాలంకరణలు గావించారు. మూలరాముల పూజ, రాయరు పాద పూజలో పీఠాధిపతి తరించిన తురణం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఊంజలలో సింహవాహనంపై తూగారు. అనంతరం పండితులు వేదాలు వల్లిస్తుండగా.. మంగళవాయిద్యాలు సుస్వరనాదం వాయించగా.. భక్తులు ఉత్సవమూర్తి నామ స్మరణ అందుకున్నారు. శ్రీమఠం మాడవీధుల్లో సింహవాహనం ఊరేగిన దశ్యం మహా అద్భుతం. 
అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం :
ఆనవాయితీలో భాగంగా వేడుకలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రధానం చేశారు. యోగీంద్ర మంపడంలో పీఠాధిపతి చేతుల మీదుగా సామాజిక సేవకుడు సూర్యనారాయణరెడ్డి, సంస్కత విద్యాపీఠం ఉప కులపతి డాక్టర్‌ వీఆర్‌ పంచముఖి, అద్వైత వేదాంత, మీమాంశ సబ్జెక్టు ప్రొఫెసర్‌ డాక్టర్‌ మణిద్రవిడకు రూ.లక్ష నగదుతోపాటు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ప్రశంశపత్రాలు అందజేశారు. గ్రహీతల సేవలు, ప్రతిభను కొనియాడారు. సాంస్కతిక ప్రదర్శనలో భాగంగా బెంగళూరుకు చెందిన ముద్దుమోహన్‌ సంగీత విభావరి, ముంబాయి రాధాకష్ణ నత్య శాల కళాకారులు నాట్య భంగిమలు భక్తులను అలరించాయి. వేడుకలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. 
 
నేడు మధ్యారాధన :
ఆరాధనలో భాగంగా శనివారం మధ్యారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రుల మూల బందావనానికి మహా పంచామతాభిషేకం, గజవాహన, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు ప్రత్యేకం. భక్తులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు తిలకిస్తారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు