ముర్గీమాతాకు పూజలు

23 Aug, 2016 00:03 IST|Sakshi
రామగుండం : మండలంలోని అక్బర్‌నగర్‌లో నివాసముండే హిజ్రా అర్చన ఆదివారం రాత్రి ముర్గీమాతాకు ప్రత్యేకSపూజలు చేశారు. ప్రతీ హిజ్రా ఏడాదిలో ఒకసారి మాతాను కొలుచుకునే సంప్రదాయం ఉంటుందని తెలిపారు. ముర్గీమాతను కొలిస్తే తమ బతుకుల్లో వెలుగులు కనిపిస్తాయని నమ్మకమని పేర్కొన్నారు. పూజ అనంతరం ముర్గీమాతను కొలిచే హిజ్రాను ముస్తాబుచేసి వేదికపై కూర్చోబెట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హిజ్రాలు కట్నకానుకలు సమర్పించారు. అనంతరం విందు భోజనం ఆరగించి, సాంస్కృతిక కార్యక్రమాలతో గడిపారు.
 
 
 
 
మరిన్ని వార్తలు