పరిశోధనలకు అధిక ప్రాధాన్యం

9 Sep, 2016 01:01 IST|Sakshi
స్విమ్స్‌లో రేడియాలజీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న డైరెక్టర్‌ రవికుమార్‌
తిరుపతి మెడికల్‌: స్టెమ్‌సెల్‌ థెరపీ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. గురువారం స్విమ్స్‌ శ్రీపద్మావతి ఆడిటోరియంలో రేడియాలజీ గోల్డ్‌మెడల్‌ ఒరేషన్‌ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్‌ రవికుమార్‌ రేడియాలజీరంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మకమైనన మార్పులను వివరించారు. డాక్టర్‌ సంజీవ శర్మ మాట్లాడుతూ శ్రీవారి చెంత ఏర్పాటైన సంస్థ ద్వారా తనకు గోల్డ్‌మెడల్‌ లభించడం తన అదృష్టం అన్నారు.‘క్లినికల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ ఇమేజ్‌ గైడెడ్‌ ఆటోలోగస్‌ స్టెమ్‌సెల్‌ థెరపీ ఇన్‌ వేరియస్‌ స్టేజెస్‌’ అనే అంశంపై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేశారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏవై లక్ష్మీ మాట్లాడుతూ రేడియాలజీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏటా గోల్డ్‌ మెడల్‌ ఇస్తున్నట్టు తెలిపారు.
 
 
 
మరిన్ని వార్తలు