డెంగీతో గర్భిణి మృతి

23 Oct, 2016 21:18 IST|Sakshi
తుళ్ళూరు: డెంగీ లక్షణాలతో గర్భిణి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన తుళ్ళూరులో గత 20 రోజుల్లో డెంగీ లక్షణాలతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గర్భిణి కంతేటి కవిత(19) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో మంగళగిరిలోని ఓ పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి వైద్యులు పరీక్షలు చేసి డెంగీ లక్షణాలున్నాయని చెప్పారు. చికిత్స చేసినా ఫలితం లేక ఆదివారం కవిత మృతిచెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన కవిత ఐదు నెలల కిందట తుళ్లూరుకు చెందిన రాజేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జెట్టి బిందు 20 రోజుల కిందట డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు