గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు

8 Sep, 2016 00:22 IST|Sakshi
ఇటిక్యాల:ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లును పూర్తిచేసినట్లు గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపారు. బుధవారం బీచుపల్లి వద్ద నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన  పరిశిలించారు. భారీ క్రే న్‌ల సహాయంతో గణేశ్‌ విగ్రహాలను నదిలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణానది వంతెన కింది భాగంలో బుధవారం జేసీబీతో చదును చేయించారు. ఈ ఏడాది కృష్ణానదిలో నీరు పుస్కలంగా ఉండటం సంతోషకరమని అన్నారు. డీఎస్పీ వెంట ఇటిక్యాల ఎస్‌ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్‌ సవారన్న తదితరులు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు