గృహాలను ఖాళీ చేయమనడం అన్యాయం

29 Oct, 2016 01:44 IST|Sakshi
గృహాలను ఖాళీ చేయమనడం అన్యాయం
  • డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య
  • నెల్లూరు (దర్గామిట్ట) : నగరంలోని వైఎస్సార్‌ నగర్‌లో నిర్మించిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను టీడీపీ నేతలు ఖాళీ చేయించాలనడం చాలా అన్యామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం నగరలోని ఇందిరాభవన్‌లో విలేకర్ల సమావేశంలో  మాట్లాడారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 170 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో 6,500 మంది లబ్ధిదారులకు న్యాయం చేకూరేలా పక్కాగృహాలను నిర్మించడం జరిగిందన్నారు. గృహాలు నాసిరకంగా ఉన్నాయంటూ 10 రోజుల్లో ఖాళీ చేయమనడం చూస్తే ఆ పార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టేందుకే  ఈ పన్నాగమన్నారు. చేవూరి దేవకుమార్‌రెడ్డి మాట్లాడతూ పంట కాలువలపై నివసించే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఉన్నపలంగా వెళ్లిపొమ్మంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని తీసుకువచ్చి రాజధాని అమరావతి శంకుస్థానపన చేయించిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమి సాధించాడని ప్రశ్నించారు.  చెంచలబాబు యాదవ్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పించిన ఘతన వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.  
     
     
మరిన్ని వార్తలు