కడియం రికార్డు బద్దలయింది

24 Nov, 2015 13:52 IST|Sakshi
కడియం రికార్డు బద్దలయింది

వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గత రికార్డు బద్దలయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్  ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఓట్లతో మెజార్టీ దిశగా దూసుకు వెళుతున్నారు. గతంలో ఇక్కడ రికార్డు ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరిట ఉండేది. దయాకర్ సాధించిన ఈ రికార్డు గతంలో 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సాధించిన మెజార్టీ కన్నా కూడా అధికమే.

ప్రస్తుతానికి టీఆర్ఎస్-5,39,096, కాంగ్రెస్-1,53,896, బీజేపీ - 1,28,452, వైఎస్ఆర్ సీపీకి-20,666 ఓట్లు లభించాయి.  2014లో ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. కాగా, నేటి ఉప ఎన్నికల ఫలితాల్లోని ప్రతి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే మెజారిటీ 5 లక్షలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.

మరిన్ని వార్తలు