రేపు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం

12 Sep, 2016 23:23 IST|Sakshi
అనంతపురం ఎడ్యుకేషన్‌ : 
ఇంటర్‌ విద్యార్థులకు త్వరలో జరిగే  గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (అథ్లెటిక్స్‌)కు సంబంధించి నిర్వహణపై చర్చిం చేందుకు  స్థానిక కొత్తూరు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాళ్లు, పీడీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు. 
 
రేపు ఆంగ్ల బోధనోపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలోని మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో పని చేస్తున్న ఇంగ్లిషు టీచర్లకు  బుక్కపట్నం డైట్‌ కళాశాలలో  బుధవారం  నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 18 వరకు  ధర్మవరం, పెనుకొండ డివిజన్లకు, 20 నుంచి 24 వరకు అ నంతపురం, గుత్తి డివజన్ల పరిధిలోని టీచర్లు హాజరుకావాలని సూ చించారు.  
 
గతంలో ఆంగ్లపరీక్ష రాసిన ప్రతి ఉపాధ్యాయుడు త ప్ప కుండా శిక్షణకు హాజరుకావాలని, ఈ పరీక్షకు గైర్హాజరైన పాఠశాలల్లో ప్రస్తుతం ఆంగ్లం  బోధించే ఉపాధ్యాయులు తప్పక హా జరుకావాలని తెలిపారు. హాజరుకాని  వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని  స్పష్టం చేశారు.
 
ఉపాధ్యాయుల జాబితా  పంపండి  
జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్‌–1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు జాబితా, మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య వివరాలు ఎంఈఓలకు అందజేయాలని హెచ్‌ఎంలను డీఈఓ అంజయ్య  ఓ ప్రకటనలో ఆదేశించారు.
 
ఎంఈఓలు, మండలస్థాయిలో నిర్దేశించిన కమిటీ సభ్యులు బుధవారం ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో నిర్వహించే సమావేశానికి  వివరాలతో హాజరుకావాలని సూచించారు.  మీడియం, పాఠశాలల వారీగా మండలంలో ని 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టు వారీగా మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన పాఠశాల, నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు