మూలన పడ్డ ముద్రణ యంత్రాలు

18 Jan, 2017 22:29 IST|Sakshi
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవస్థలు
  • ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులు
  • పట్టించుకోని జిల్లా అధికారులు
  • కాకినాడ లీగల్‌ : 
    నూతన ముద్రణ యంత్రాలు (ఫ్రాంకింగ్‌ మెషీన్లు) జిల్లాకు వస్తున్నాయంటూ జిల్లా అధికారులు ఆరు నెలల నుంచి ఊరిస్తున్నారు తప్ప వాటి జాడ కనిపించడంలేదు. జిల్లాలో బ్యాంక్‌ రుణాలు, స్థలాల నుంచి రుణాలు తీసుకునేవారికి ఫ్రాంకింగ్‌ మెషీన్లు లేక స్టాంపులు ముద్రించే వెసులుబాటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మెషీన్లు వినియోగం ముఖ్యంగా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్‌ లోన్లు తీసుకునే సమయంలో ఒక్కో రిజిస్ట్రేష¯ŒSకు రూ.వెయ్యి నుంచి రూ.లక్ష, రూ.2 లక్షల వరకూ స్టాంపులను కూడా వినియోగించే పరిస్థితులు ఉంటాయి.
    జిల్లాలోని రిజిస్ట్రేష¯Œ్స అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఆధ్వర్యంలో 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 13 చోట్ల ముద్రణ యంత్రాలు (ఫ్రాంకింగ్‌ మెషీన్లు) ఏర్పాటు చేశారు. వీటిలో సాంకేతిక లోపాలతో ద్రాక్షారామ, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు తదితర 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని మెషీన్లు పనిచేయడంలేదు. ప్రస్తుతం తుని, అమలాపురం ప్రాంతాల్లోని మెషీన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ముద్రణ యంత్రాలను సర్వీసింగ్‌ చేసే ‘పిట్నీబౌజ్‌’ సంస్థ పనిచేయని యంత్రాలపై దృష్టి పెట్టడంలేదు. దీంతో ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. 
    సర్వీస్‌ ఇవ్వని కంపెనీతోనే ఒప్పందం 
    కొన్నేళ్లుగా జిల్లాలో ఉన్న ఫ్రాంకింగ్‌ మెషీన్లకు సర్వీస్‌ ఇవ్వాల్సిన పిట్నీబౌజ్‌ ప్రైవేటు సంస్థ పట్టించుకోకపోవడంతో అవి మూలనపడ్డాయి. సుమారు మూడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పట్టించుకోని ఆ సంస్థతోనే అధికారులు ఒప్పందం కుదుర్చుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతున్న  జిల్లా అధికారులు మెషీన్లకు మరమ్మతులు చేయకపోయినా ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.
    సమస్య ఇలా...
    వివిధ లావాదేవీల్లో ఒప్పంద పత్రాలపై స్టాంపు వేయించుకోవాలన్నా, బ్యాంకు నుంచి రుణం పొందాలన్నా అంత సులభం కాదు. ఒప్పంద పత్రాలకు స్టాంపు కాగితాల విలువను తీసుకొచ్చే ముద్రలు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రాకింగ్‌ మెషీన్లు అలంకార ప్రాయంగా మిగిలాయి. రూ.వెయ్యి పైబడి విలువైన స్టాంపు వేయించుకోవాలంటే  జిల్లాలో ఎక్కడ ఫ్రాకింగ్‌ యంత్రం పనిచేస్తుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకు రుణాల విషయంలోనూ, స్థిరాస్తి లావాదేవీల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
     
    త్వరలో కొత్త మెషీన్లు
    నూతన ఫ్రాంకింగ్‌ మెషీన్ల కోసం పిట్నీబౌజ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలో అవి జిల్లాకు రానున్నాయి. పాత మెషీన్లను మరమ్మతులు చేసేందుకు ముంబాయి పంపించాం. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తాం.
    – పి.లక్షీ్మకుమారి, 
    స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష¯ŒS డీఐజీ, తూర్పుగోదావరి
     
మరిన్ని వార్తలు