కారాగారాలు కిటకిట

19 Jul, 2016 20:20 IST|Sakshi

రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగాలతో మొదలుకొని మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం ఇవి పనిచేస్తున్నాయి. కేంద్ర కారాగారాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది సామర్థ్యం కాగా ప్రస్తుతం 3,500 మంది ఉన్నారు. అలాగే, మహిళా కేంద్ర కారాగారం కెపాసిటీ 220 ఉండగా... ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్‌జైళ్లలో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నారు. అయితే, జైళ్ల శాఖ మాత్రం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకు గాను 1500 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు