చెరకును పీల్చేస్తున్నారు

1 Jan, 2017 02:59 IST|Sakshi
చెరకును పీల్చేస్తున్నారు

తన్నుకుపోతున్న పొరుగు జిల్లాల  ప్రైవేట్‌ చక్కెర కర్మాగారాలు
పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ  ఎలా సమకూరిందన్నదే ప్రశ్న
పట్టించుకోని చెరకు అభివృద్ధి అధికారులు


అనకాపల్లి : జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో సాగవుతున్న చెరకుపై ప్రైవేట్‌ కర్మాగారాలు కన్నేశాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రైవేట్‌ చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలోని చెరకును తరలిస్తున్నాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత రెండు సీజన్ల నుంచి గానుగాట జరగకపోవడంతో దీనిని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు.

ఈ విషయంలో చెరకు అభివృద్ధి అధికారులు ప్రైవేట్‌ కర్మాగారాలకు అనుకూలం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరకును తరలించే విషయంలో ఆయ ఫ్యాక్టరీలకు అధికారాలు ఉంటాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గాను గాట ఆడకపోవడంతో ఈ ప్రాంత చెరకును ఏటికొప్పాక, తాండవ చక్కెÆ ý‡ కర్మాగారాలకు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. అయితే చెల్లింపు లు నగదు రహితంగా జరగాలన్న నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది.

పెద్ద నోట్ల రద్దు అంశాన్ని అనుకూలంగా మలుచుకొని...
అనకాపల్లి చక్కెర కర్మాగారం పరిధిలో లక్ష హెక్టార్లకు పైబడి చెరకు సాగవుతోంది. దీనిలో కొంత చెరకును బెల్లం తయారీకి వినియోగించగా, మిగిలిన చెరకును తప్పని పరిస్థితుల్లో    కర్మాగారాలకు తరలించాల్సి ఉంది. సహకార చక్కెర కర్మాగారాలకు చెరకును తరలించే రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను నగదు రహి త లావాదేవీల రూపేణా వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ ఈ నిబంధనలు అమలు చేయకుండా పొరుగు జిల్లాలకు చెందిన ప్రైవేట్‌ కర్మాగారాలు వ్యవహరించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఈ ప్రాం తం నుంచి చెరకును తరలిస్తున్న ఒక ప్రైవేట్‌ కర్మాగారం.. తన పరిధిలో చెరకును తరలించిన రైతులకు రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. కానీ అనకాపల్లి పరిధి లోని రైతుల నుంచి సేకరిస్తున్న చెరకుకు మద్దతు ధరను టన్ను కు రూ.2,070 చొప్పున చెల్లిస్తోంది. అది కూడా నగదు రూపంలోనే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేదు. కానీ అనకాపల్లి కర్మాగారం పరిధిలోని కూం డ్రం, నీలకంఠాపురం, వెంకుపాలెం కేంద్రంగా ఏర్పాటు చేసిన చెరకు బరువు తూచే కాటాల వద్ద చెల్లింపులను ఏ రోజుకు ఆ రోజుకు జరుపుతున్నారు. సుమారు 400 టన్నుల వరకు రోజుకు çతరలించుకుపోతున్నారు. ఈ ప్రాంత రైతులకు రోజుకు రూ.8 లక్షల నగదును కొత్త కరెన్సీ రూపంలో అందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న.

సహకార కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300
సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 చెల్లిం చాల్సి ఉంది. అది కూడా అకౌంట్లలోనే జమ చేయాలనే నిబంధన ఉంది. ఈ విధంగా కూడా రైతులు ప్రైవేట్‌ కర్మాగారాలకు చెరకును తరలించడం ద్వారా టన్నుకు రెం డు వందలకు పైగా నష్టపోతున్నారు. అయితే సహకార కర్మాగారాలకు తరలించే చెరకుకు మద్దతు ధర ఎప్పుడు అందుతుందో తెలియని ఆందోళన కూడా రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు తరలివెళ్లాల్సిన 20 వేల టన్నుల చెరకును ఇప్పటికే ప్రైవేట్‌ కర్మాగారాలు తీసుకెళ్లిపోయాయి. అయితే జిల్లాలో సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాల పరిధిలో సమకూరాల్సిన చెరకు మోతాదు తగ్గితే అక్కడ కూడా క్రషింగ్‌ జరిపే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా భవిష్యత్‌లో ప్రైవేట్‌ కర్మాగారాల పుణ్యాన తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు ప్రమాదం పొంది ఉంది.

మరిన్ని వార్తలు