నాణ్యత కొరవడ్డ సత్తెన్న ప్రసాదం

3 Aug, 2016 23:31 IST|Sakshi
నాణ్యత కొరవడ్డ సత్తెన్న ప్రసాదం
‘డయల్‌ టు ఈఓ’లో పలువురు భక్తుల ఫిర్యాదు 
తయారీలో మరింత జాగ్రత్త వహిస్తామన్న ఈఓ  
అన్నవరం:
సత్యదేవుని ప్రసాదం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసాదం నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈఓకు విజ్ఞప్తి చేశారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం పది నుంచి 11 గంటల వరకూ నిర్వహించిన ‘డయల్‌ టు ఈఓ’ కార్యక్రమంలో పలువురు భక్తులు వివధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రసాదం గురించి వచ్చిన ఫిర్యాదులకు ఈఓ జవాబిస్తూ రోజూ తాను ప్రసాదం విభాగాన్ని తనిఖీ చేస్తున్నానని, రుచి, శుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడడడం లేదని చెప్పారు. అయినా విమర్శలు వస్తున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మెుత్తం 12 మంది ఈఓకి ఫోన్‌ చేశారు. ఏసీ ఈరంకి జగన్నాధరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు  చెప్పిన సమస్యలు,S ఈఓ ఇచ్చిన సమాధానాలు ఇలా..
l ప్రసాదం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదు. ప్యాకెట్లలో ప్రసాదం కొంచెం నల్లగా మాడినట్లు ఉంటోంది. అక్కడక్కడా విస్తరాకుముక్కలు అంటుకుని ఉంటున్నాయి.
–భాస్కరరావు, పెద్దాపురం, రమేష్, రాజమండ్రి, సత్యనారాయణమూర్తి, ద్రాక్షారామ, శ్రీనివాస్, తుని, మల్లాడి సత్యనారాయణ, పి.గన్నవరం.
ఈఓ : ప్రసాదం తయారీలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. వీఐపీ ల కోసం కొన్ని సార్లు ప్రసాదం కొద్దిగా నలుపురంగు వచ్చేలా వేయిస్తారు. అలాంటి ప్యాకెట్లు మిగిలితే విక్రయిస్తాం. నల్లగా ఉన్నందున ప్రసాదం కాదని అనుకోకూడదు. ప్రసాదంఫ్రిజ్‌ లో పెడితే నెయ్యి పేరుకుని తెల్లగా కనిపిస్తుంది. అది బూజని కొందరు అనుకుంటున్నారు. ప్రసాదం మామూలుగా అయితే 48 గంటలు, ఫ్రిజ్‌లో పెడితే నాలుగు రోజులు  నిల్వ ఉంటుంది.సాధ్యమైనంత వరకూ ఏరోజు తయారైన ప్రసాదం ఆ రోజే విక్రయిస్తున్నాం. ప్రసాదం కట్టే ఆకు ముక్కలు మినహా మరేమీ అతుక్కునే అవకాశం లేదు.
l వయో వృద్ధులకు  సత్యదేవుని దర్శనం  సులువుగా అవుతుందా..?
–చిక్కాల పెద్దిరాజు, రాజమండ్రి
ఈఓ: వయోవృద్ధులు, నడవలేని వారు ఆలయం వెనుక గల పశ్చిమరాజగోపురం వద్దకు వస్తే వీల్‌ఛైర్‌లు ఉంటాయి. వాటిలో లిఫ్ట్‌ వద్దకు వచ్చి, దాని ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
∙వ్రతాలలో కలశం పై పెట్టే వస్త్రం చాలా చిన్నదిగా ఉంటోంది. అది జాకెట్టుకు సరిపోవడం లేదు.          
     –కె.సత్యశ్రీకాంత్, ఇంజరం
ఈఓ: రూ.1,500 టిక్కెట్‌ వ్రతమాచరించే వారికి జాకెట్టు ముక్క, కండువా ఇస్తున్నాం. మిగిలిన వ్రతాలాచరించే వారికి జాకెట్టుముక్క ఇవ్వడం లేదు. శాస్త్రప్రకారం ఒక వస్త్రాన్ని మాత్రమే కలశం మీద పెడతారు. వ్రతాలాచరించే భక్తులు సొంతంగా జాకెట్టు ముక్క తెచ్చుకుని  కలశం మీద పెట్టుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు.
l వీఐపీలు కాని వారికి కూడా పూర్ణకుంభస్వాగతం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తప్పు కదా?
–సత్యనారాయణ, రాజానగరం
ఈఓ: ఎవరికి పూర్ణకుంభ స్వాగతం పలకాలనే దానిపై ఉన్న ప్రోటోకాల్‌ నిబంధనలనే పాటిస్తున్నాం.  
l దేవస్థానంలో చిన్నపిల్లలకు పాలు ఉచితంగా సరఫరా చేయాలి.                           –భీమశంకరం, అన్నవరం
ఈఓ: పరిశీలించి అమలు చేస్తాం.
l దేవస్థానంలోని అన్ని విభాగాలలో ఫిర్యాదుల పుస్తకాలు ఉంచాలి.
–సత్యనారాయణ, పెద్దాపురం
ఈఓ: అన్ని విభాగాల్లో ఫిర్యాదుల పుస్తకాలు అందుబాటులో ఉంచాం.
l మెట్ల దారిలో వెళ్లే భక్తులకు మధ్యలో షెల్టర్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు. తొలిపాంచా వద్ద కూడా వాహనాలు ఆపుకోవడానికి షెల్టర్‌ ఏర్పాటు చేయాలి. పాంచా వద్ద భక్తులకు బిచ్చగాళ్ల వేధింపులు అధికంగా ఉన్నందున వారిని అక్కడ నుంచి పారదోలండి.
–ఎస్‌.నానాజీ, అన్నవరం
ఈఓ: మెట్లదారి మలుపుల్లో, తొలిపాంచా వద్ద త్వరలోనే షెల్టర్‌లు ఏర్పాటు చేస్తాం. తొలిపాంచా వద్ద బిచ్చగాళ్లను తరిమేయమని సెక్యూరిటీ గార్డులను ఆదేశించాం.
 
 
మరిన్ని వార్తలు