దుర్గగుడి ఈవోపై ఆగ్రహం

16 Sep, 2016 00:01 IST|Sakshi
దుర్గగుడి ఈవోపై ఆగ్రహం
 
  • ప్రసాదం నాణ్యతపై దృష్టిసారించాలని ఆదేశం
 
సాక్షి,విజయవాడ: భక్తుల సౌకర్యాల కంటే దేవాలయానికి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న దుర్గగుడి ఈవో ఎ.సూర్యకుమారిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సీరియస్‌ అయ్యారు. దసరా ఉత్సవాలు సందర్భంగా స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖలతో గురువారం జరిగిన  తొలి సమీక్షా సమావేశంలో మంత్రి దేవినేని ఉమాతో సహా పలువురు నేతలు 
 సాక్షి ఎఫెక్ట్‌
కుంకుమార్చన రేట్లు పెంచొద్దు.... 
దసరా ఉత్సవాల్లో 11 రోజులు జరిగే లక్ష కుంకుమార్చన పూజల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచి ఆదాయం పెంచుకోవాలని ఈవో సూర్యకుమారి భావించారు.   దీనిపై ‘సాక్షి’లో ‘దసరాకు దోచేయ్‌’ పేరుతో వచ్చిన క«థనంతో స్పందించిన మంత్రి తమను సంప్రదించకుండా కుంకుమార్చన రేట్లు పెంచవద్దంటూ ఈవోకు సూచించారు. ఇది రాష్ట్రపండుగ కావడంతో దేవాదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారులు కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ మాట్లాడుతూ పూజ టిక్కెట్లు రేట్లు 1116 నుంచి నాలుగువేలు, దర్శనం టిక్కెట్‌ రూ.100 నుంచి రూ.300 పెంచడం పట్ల తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్ష మంది భక్తులు వస్తున్నారని, రాబోయే రోజుల్లో రెండు లక్షలకు పెరుగుతారని అందువల్ల కుంకుమార్చన టిక్కెట్‌ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రేట్లు ప్రతి ఏడాది పెంచుతున్నారని ఇది సరిౖయెన పద్ధతి కాదని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అన్నారు.  ఇదిలా ఉండగా కుంకుమార్చన రేట్లు పెంచడం పై మంత్రి ఉమా సమావేశానికి ముందు కొంతమంది వద్ద వాకబు చేశారు.  మూలనక్షత్రం రోజున రూ.10,116 టిక్కెట్‌ పై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. 11 రోజుల దర్శనానికి రూ.5000 పెట్టడాన్ని పలువురు తప్పుపట్టారు. 
  ప్రసాదంలో ఉమా పంటి కిందకు రాయి...
మంత్రి ఉమాకు దేవస్థానం అధికారులు పులిహోర ప్రసాదాన్ని ఇచ్చారు. ప్రసాదం తింటుండగా అందులో రాయి వచ్చింది. ఆ రాయి తీసి ఈవోకు చూపిస్తూ మాకు పెట్టే ప్రసాదంలోనే రాళ్లు వస్తుంటే ఇక సాధారణ భక్తులకు పెట్టే ప్రసాదం ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించడంతో ఈవో నీళ్లు నమిలారు. అక్కడ ఉన్న జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ మాట్లాడుతూ దేవస్థానం విక్రయించే ప్రసాదాలపై భక్తులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రసాదాల నాణ్యతపై దష్టి సారించాలని మంత్రి ఈఓను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై అసాంఘిక కార్యకలాపాలు అరికట్టండి.....
దుర్గగుడిపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తమ దష్టికి వచ్చిందని, దీనిపై ఈవో దష్టిసారించాలని  గద్దె అనూరాధ అభిప్రాయపడ్డారు.   ఇదిలా ఉండగా మల్లికార్జున మహామండపం నుంచి కాకుండా మెట్లమార్గం నుంచి భక్తుల్ని దర్శనానికి పంపితే బాగుంటుందని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. 
క్యూలైన్లపై బుద్దా వెంకన్న సీరియస్‌ దసరా ఉత్సవాల్లో అవసరం ఉన్నా లేకుండా వినాయకుడు గుడి నుంచి క్యూలైన్లు వేయడం వల్ల వన్‌టౌన్‌వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉత్సవాల్లో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే అవసరం ఉంటుందని, మిగతా రోజుల్లో క్యూలైన్లు తొలగించాలని కోరారు. అర్జున వీధిలో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తుల్ని పంపాలని, మిగిలిన వీధుల్లో స్థానికులు తిరిగేందుకు అనుమతించాలని కోరారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ దసరా ఉత్సవాల లోగా కెనాల్‌రోడ్డు, అర్జున వీధి  అనుసంధానం పూర్తి చేయాలని సూచించారు. మల్లికార్జున మహామండపాన్ని పూర్తివినియోగంలోకి తేవాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్‌ బాబు ఏ, నగర కమిషనర్‌ వీరపాండ్యన్, అడిషనల్‌ సీపీ హరికుమార్, ట్రాఫిక్‌ డీసీపీ రాణా తదితరులు పాల్గొన్నారు. 
 
 
  
 
 
మరిన్ని వార్తలు