చచ్చినా తీరని కష్టం

9 Jan, 2017 23:00 IST|Sakshi
చచ్చినా తీరని కష్టం
- శ్మశానానికి వెళ్లేందుకు రహదారి కష్టం
- తీవ్ర అవస్థలు పడుతున్న కౌలూరు ఎస్సీ కాలనీవాసులు
 
పాణ్యం: శ్మశాన స్థలం ఉన్నా అక్కడకు వెళ్లేందుకు సరైన దారి సౌకర్యం లేక మండల పరిధిలోని కౌలూరు ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రేమ్‌కర్‌ ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ప్రధాన రోడ్డు నుంచి కానుగల వాగును దాటి శ్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవిలో తప్ప వాగు నిత్యం పారుతుండడంతో దాటి ఎగువగడ్డకు ఎక్కి మృతదేహలను ఖననం చేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ వాగు దగ్గరకు వచ్చే సరికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కనీసం పది మంది తప్పనిసరి. అదమరిస్తే వాగులో మృతదేహం పడిపోతుంది. చచ్చిన వాడిని తీసుకువెళ్లాలంటే చచ్చేంత పని అవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానుగల వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు.
 
మరిన్ని వార్తలు