సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరట!

9 Jan, 2017 22:56 IST|Sakshi
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరట!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన
►  కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
► పర్మినెంట్‌ ఆశలపై నీళ్లు


గోదావరిఖని : సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల విషయంలో గురువారం శాసనసభలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన విధంగా స్పందించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు నైరాశ్యంలో పడ్డారు. సీఎం వైఖరిని కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఎండగడుతున్నాయి. సింగరేణిలో రోజురోజుకు కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 16 ఓపెన్ కాస్ట్‌ ప్రాజెక్టులలో నిర్వహిస్తున్న ఓవర్‌బర్డెన్  (మట్టి తొలగింపు) పనుల్లో 10 వేల మంది, సివిక్, హౌస్‌ కీపింగ్‌లో నాలుగు వేల మంది, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్లంబర్, మేషన్  తదితర విధుల్లో 700 మంది, హర్టికల్చర్‌ విభాగంలో 600 మంది, లోడింగ్, అ¯ŒSలోడింగ్‌ విభాగంలో 800 మంది, రైల్వే సైడింగ్‌ మెయింటనెన్స్ లో 200 మంది, కోల్‌ ట్రాన్స్ పోర్టులో 500 మందితోపాటు పలు భూగర్భ గనుల్లో పర్మినెంట్‌ కార్మికులు చేసే రూఫ్‌బోల్టింగ్‌ çపనుల్లో, అన్వేషణ విభాగంలో, గనుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో, ఓసీపీల వద్ద బెల్ట్‌క్లీనింగ్‌ పనుల్లో కలిపి మొత్తం 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

యాజమాన్యమే ప్రిన్సిపుల్‌ ఎంప్లాయర్‌
సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ప్రిన్సిపుల్‌ ఎంప్లాయర్‌గా సింగరేణి యాజమాన్యమే వ్యవహరి స్తోంది. కాంట్రాక్టర్‌కు ఇచ్చే డబ్బులను నిలిపివేసి యాజమాన్యమే కాంట్రాక్టు కార్మికుల తరఫున సీఎంపీఎఫ్‌ చెల్లిస్తోంది. ఇలా చెల్లించగా మిగిలిన డబ్బులనే కాంట్రాక్టర్‌కు అందజేస్తుంది. ఇలా కాంట్రాక్ట్‌ కార్మికులతో యాజమాన్యం సత్సంబంధాలు కలిగి ఉంది.  

హైపర్‌ కమిటీ వేతనాలకు దిక్కులేదు
కోల్‌ఇండియాలో జరిగిన జేబీసీసీఐ సమావేశంలో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కాట్రాక్టు కార్మికులకు హైపవర్‌ వేతనాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కోల్‌ఇండియా పరిధిలోని బల్లార్షా, చాందాలలోని బొగ్గు గనుల్లో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాల కింద రూ.18 వేల వేతనం, బోనస్, ఇతర అలవెన్స్ లు చెల్లిస్తున్నారు. అయితే ఇదే రకంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా హైపవర్‌ కమిటీ వేతనాలు చెల్లించాలని పలువురు శాసనసభ్యులు ప్రభుత్వానికి విన్నవించగా...అసలు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని ముఖ్యమంత్రి పేర్కొనడంతో కాంట్రాక్టు కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

కాంట్రాక్టు కార్మికులను విస్మరించిన సీఎం : కార్మిక సంఘాలు
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యులవుతూ కంపె నీ లాభాల్లోకి వెళ్లడానికి కృషి చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించ డం సరైంది కాదని కాంట్రాక్టు కార్మిక సంఘాలై న ఎస్‌సీసీడబ్ల్యూ, ఇప్టూ, ఏఐసీటీయూ, ఏఐఫ్‌టీయూ, డీఐటీయూ, టీన్  టీయూసీ, ఎస్‌ఓబీ సీడబ్ల్యూ నాయకులు కె.విశ్వనాథ్, ఎంఏ.గౌస్, జె.చంద్రయ్య, చిలుక ప్రసాద్, వెల్తురు సదానందం, దాసరి దుర్గయ్య, ఐ.రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కాం ట్రాక్టు కార్మికులను గుర్తించి ఒకటో క్యాటగిరీ వేతనాలను చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు.

మరిన్ని వార్తలు