అవగాహనతోనే సమస్యల పరిష్కారం

9 Apr, 2017 15:41 IST|Sakshi
అవగాహనతోనే సమస్యల పరిష్కారం

► జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ

రాజాం రూరల్‌ : అవగాహనతో వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. శనివారం  స్థానిక కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహించిన  జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేడు చాలా మంది అవగాహనలోపంతో ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి, వివాదాలకు వెళ్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో పెద్దల సమక్షంలో వీటిని పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో వర్గవిభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక ఉపాధి పని చేసుకుంటూ ఉండాలని చెప్పారు.

ఎస్పీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో వివాదాలు లేని సమాజాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలను నిషేధించడం,మద్యం అమ్మకాలు లేకుండా చూడ డం, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. అంతకుముందు ఈ లోక్‌అదాలత్‌లో 277 కేసులు పరిష్కారమైనట్లు సీని యర్‌ సివిల్‌ జడ్జి ఎంపీ సన్నిధిరావు తెలిపారు. క్రిమినల్‌ కేసులు 33, చెక్‌ బౌన్స్‌ కేసు 1, భార్యాభర్తల కేసు ఒకటి పరిష్కారమయ్యాయని వివరించారు. అలాగే మెయింటినెన్స్‌ కేసులు రెండు పరిష్కారం కాగా.. రూ.2.50 లక్షలు, సివిల్‌ కేసు ల రెండు ‡ద్వారా రూ.20వేలు, 221 పెట్టీ కేసుల నుంచి రూ.1,67,500లు వసూలు చేసినట్లు తెలి పారు. అక్రమంగా మందుగుండు కలిగిన 17 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈ అదాలత్‌లో ఎస్‌.అప్పలనాయుడు, జూనియ ర్‌ సివిల్‌ జడ్జి కృష్ణసత్యలత, బూరి దామోదరరావు, పాలకొండ డీఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ, రాజాం సర్కిల్‌ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు