ఇంకా రాని ప్రగతి నివేదికలు

12 Dec, 2016 15:19 IST|Sakshi
ఇంకా రాని ప్రగతి నివేదికలు

రాత పుస్తకాలలోనే నమోదు చేస్తున్న ఉపాధ్యాయులు..
లక్ష్మణచాంద : పాఠశాలల అభివృద్దికి ,విద్యార్థుల ప్రగతి కోసం ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు.ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయాల్సిన అవసరం ఏర్పడింది. చివరకు పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన  ప్రగతి  కూడా సరఫరా చేయడం లేదంటే  పాఠశాలల నిర్వాహణపై ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది.

పాఠశాలలు ప్రాంభమై ఆరు నెలలైన
పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలల  కాలం గడిచిపోరుుంది. విద్యార్థుల సామార్‌థ్యలను, హాజరు శాతం నమోదుకు   ప్రాథమిక   స్థారుు లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరతగతి వరకు, ప్రాథమికోన్నత స్థారుులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అందిచాల్సిన అవసరం ఉంది.సమగ్ర ప్రగతి నివేదికలు నేటికి పా ఠశాలలకు అందలేదు. దీనితో విద్యార్థుల సా మార్‌థ్యలు తల్లిదండ్రులకు తెలియడం లేదు.

 రాత పుస్తకాలలోనే
ప్రగతి నివేదికలు ఇప్పటి వరకు సరపరా కాకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థల యొక్క గణాంకాలను రాత పుస్తకాలలోనే నమోదు చేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇది
జిల్లాలోని నిర్మల్ ,ముథోల్ ,ఖానాపూర్ నియోజక వర్గాల పరిదిలో మొత్తం 19 మండలాలు ఉన్నారుు.ఆయా మండలాలలో ప్రాథమిక పాఠశాలలు 497 ,ప్రాథమికోన్నత పాఠశాలలు 90 ,ఉన్నత పాఠశాలలు 104 ,ఆశ్రమ పాఠశాలలు 17 ,ఒక ఎరుుడెడ్ పాఠశాల ,ప్రభుత్వ పట్టణ పాఠశాలలు 40 ,కేజిబీవి పాఠశాలలు 13 ,సాంఘిక సంక్షమ గురుకుల పాఠశాలలు 4 ,బాలికల గురుకుల పాఠశాల 01 ,గిరిజన పాఠశాలలు 44 ,మిని గురుకులం 01, మొత్తం 812 పాఠశాలలు ఉన్నారుు. జిల్లాలోని అన్ని పాఠశాలలో కలిపి ఒక లక్ష నాలుగు వందల మంది  విద్యార్థులు విధ్యను అభ్యసిస్తున్నారు. వీరికి జూలై ,ఆగస్ట్ మాసంలో నిర్మాణాత్మక మదింపు -1(ఎఫ్‌ఏ 1),సెప్టెంబర్ ,అక్టోబర్ మాసంలో నిర్మాణాత్మక మదింపు 2(ఎఫ్‌ఏ 2),పరీక్షలు పూర్తి అయ్యారుు.అంతేకాకుండా అక్టోబర్ 27 నుండి నవంబర్ సంగ్రహాణాత్మక మూల్యాంకనం 1,పరీక్షలు పూర్తి అయ్యారుు.దీనితో విద్యార్థుల ప్రమాణాల ఆదారంగా గ్రేడ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఎప్పటికప్పుడు విద్యార్థులు ప్రగతి విలువలు తెలిస్తే తల్లిదండ్రులకు సైతం తమ పిల్లల నైపుణ్యాన్ని అంచనావేయవచ్చు.

 విద్యార్థుల ఆరోగ్యం నివేదికలు
 నిరతంతర సమగ్ర మూల్యాంక రిజిస్టర్లు అందలేదు. వీటిలో విద్యార్థుల ఆరోగ్య సమాచారం, నిర్మాణాత్మక మదింపు, సంగ్రహనాత్మక మదింపు, సహపాఠ్య కార్యక్రమాల వివరాలు ఉంటారుు. రిజిస్టర్లు సత్వరం అందిస్తే ఇద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
 ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం
 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల అభివృద్దికి అన్ని రాకల కట్టుబడి వుంటుందని ప్రఝభుత్వం చెప్పె మాటాలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని అవి కార్యరూపం దాల్చడం లేదని జిల్లా పీడీఎస్‌యూ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులకు ఇవ్వల్సిన ప్రగతి నివేదికలు త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు.  శేఖర్  ,పీడిఎస్‌యూ , నాయకులు
 

ప్రభుత్వానికి నివేదికలు అందించాం
 విద్యార్థులకు వారి సమగ్ర ప్రగతిని తెలియచేసే నివేదికలకు సంబందించిన ప్రగతి నివేదికలు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించాము. ప్రగతి నివేదికలు రాకపోవడంతో విద్యార్థులకు సంబందించిన సమగ్ర సమాచారంను రాత సుస్తకాలలోనే నమోదు చేరుుస్తున్నాం. ప్రగతి నివేదికలు రాగానే వాటిలో నమోదుచేసి  వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేస్తాం.
 ఏంఈవో, మాజిద్ 

మరిన్ని వార్తలు