పోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ కమిటీ ఎంపిక

28 Jul, 2016 23:27 IST|Sakshi
పోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ కమిటీ ఎంపిక
  •    1 నుంచి విద్యార్థులకు అవగాహన సదస్సులు
  • విజయవాడ(గాంధీనగర్‌): ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ అమరావతి శాఖ నూతన కమిటీ ఎంపికైంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యూష సుబ్బారావు ప్రకటించారు. అమరావతి శాఖ నూతన అధ్యక్షుడుగా బీ రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా జేæ కాశీవిశ్వేశ్వరరావు ఎంపికైనట్లు తెలిపారు, వీరితోపాటు ఉపాధ్యక్షులుగా కే విద్యాసాగర్, డీ అవంతి, కే సుభాష్, సహాయ కార్యదర్శులుగా ఎల్‌ వెంకటేశ్వర్లు, ఎన్‌ సతీష్, జీ సురేష్, కోశాధికారిగా ఎస్‌కే బాబీ, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎంపికచేసినట్లు చెప్పారు. ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి స్ఫూర్తి పేరుతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
     
     
     
మరిన్ని వార్తలు