ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్గా మార్ని వెంకటరామారావు

30 Jan, 2017 23:34 IST|Sakshi
ధవళేశ్వరం :
గోదావరి తూర్పు, మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మ¯ŒSగా పెద్దాడ డీసీ మార్ని వెంకట రామారావు ఎన్నికయ్యారు. సోమవారం ఆయన ధవళేశ్వరంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి  ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గోదావరి తూర్పు, మధ్యడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మ¯ŒS భూపతి రాజు ఈశ్వరరాజు వర్మ అధ్యక్షతన ధవళేశ్వరం సీఈఆర్‌పీ గెస్ట్‌హౌస్‌లో ప్రాజెక్టు కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మ¯ŒSను ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మ¯ŒSగా పనిచేసిన సాయిరామ్‌ మృతి చెందడంతో ఈయన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మార్నిని డిడ్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, రైతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ర¯ŒS డివిజ¯ŒS ఈఈ అప్పల నాయుడు, సెంట్రల్‌ డివిజ¯ŒS ఈఈ సుధాకర్, డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మ¯ŒSలు రెడ్డి తాతాజీ, సత్యనారాయణమూర్తి, రామకృష్ణ చౌదరి ,చల్లయ్యనాయుడు, చింతల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు